Chennai: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో టీవీకే అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై అదే పార్టీకి చెందిన ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ టీవీకే పార్టీ కరూర్ జిల్లా కార్యదర్శి వీపీ మతియఝగన్, టీవీకే కరూర్ పట్టణ కోఆర్డినేటర్ పవన్‌రాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది.
Chennai: కరూర్ సభ తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ తయారు చేసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విజయ్ కావాలనే ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. విజయ్ ఉద్దేశపూర్వకంగా రాజకీయ బలప్రదర్శనకు దిగాలనే ఉద్దేశంతో అభిమానులు ఎక్కువగా వచ్చేవరకు ఆగి ఆలస్యంగా వచ్చాడని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.
Chennai: ఇదిలా ఉండగా, తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని సీఎం ఎంకే స్టాలిన్ ఇప్పటికే ఆదేశించారు. అయితే ఈ ఘటనను రాజకీయ కుట్రగా నటుడు, టీవీకే అధినేత విజయ్ అభివర్ణించారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం న్యాయ విచారణ జరుగుతుండగా, పరారీలో ఉన్న నాయకులను పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.