Chennai:

Chennai: బ‌ల‌వంతంగా అప్పు వ‌సూలు చేస్తే ఐదేళ్లు జైలు.. అసెంబ్లీలో బిల్లు

Chennai: ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను ఆస‌రా చేసుకున్న రుణ సంస్థ‌లు ఎంద‌రో జీవితాల‌ను నాశ‌నం చేశాయి. మ‌రెందరో శారీర‌క‌, ఆర్థిక ప‌రంగా అగాథంలోకి వెళ్లిపోయారు. మ‌రెన్నో ఛిద్ర‌మ‌య్యాయి. అప్పులివ్వ‌డం త‌ప్పుకాక‌పోయినా, తీసుకునే తీరులోనే జ‌బ‌ర్ద‌స్త్ చేయ‌డాలు.. రుణేత‌ర ఆస్తుల‌ను స్వాధీనం చేసుకోవ‌డాలు జ‌రుగుతుంటాయి. వాటిపై ఆధార‌ప‌డిన జీవితాలు చిన్నాభిన్న‌మ‌వుతున్నాయి. ఇలాంటి అడ్డ‌గోలు జ‌బ‌ర్ద‌స్త్ చ‌ర్య‌ల‌ను రుణ సంస్థ‌లు చేయ‌కుండా ఉండేందుకు త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా ఓ బిల్లునే తీసుకొచ్చింది. అదేమిటో తెలుసుకుందాం రండి.

Chennai: ఇక నుంచి ప్ర‌జ‌ల వ‌ద్ద బ‌ల‌వంతంగా రుణాలు వ‌సూలు చేసినా, రుణేత‌ర ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునే ప్ర‌యంత్నం చేసినా బాధ్యులైన వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఓ చ‌ట్టాన్ని తీసుకొచ్చింది. రుణ సంస్థ‌ల ఒత్తిడితో ఎవ‌రైనా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డితే ఆ సంస్థ నిర్వాహ‌కుల‌కు బెయిల్ కూడా రాకుండా జైలు శిక్ష అమ‌లు చేసేలా బిల్లు రూపొందించామని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్టాలిన్ తెలిపారు.

Chennai: అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన ఈ బిల్లును శాస‌న‌స‌భ‌, శాస‌న ప‌రిష‌త్ ఆమోదించాయి. దీనికి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇప్ప‌టి నుంచి ఎవ‌రైనా అప్పు చెల్లించాలంటూ బ‌లవంతం చేస్తే ఇక అంతే సంగ‌తులు. దీనిపై ఆ రాష్ట్ర‌వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, రుణ సంస్థ‌లు పెద‌వి విరుస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఉపరాష్ట్ర‌ప‌తి బీజేపీ అభ్య‌ర్థి వీరిలో ఎవ‌రు? ఎంపిక‌పై ఉత్కంఠ‌! నేడో, రేపో ప్ర‌క‌టించే అవ‌కాశం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *