Karnataka: కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని ఓ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పుపై ఓ భారీ యంత్రం పడింది. ఈ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఆ కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. తీరా ఏమిటి అని చూస్తూ యంత్రంలా ఉన్నది. ఏమిటిది? ఆకాశం నుంచి ఎలా పడింది? అన్న భయాందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Karnataka: బీదర్ జిల్లాలోని జలసంగి గ్రామంలో ఓ ఇంటిపై పడింది భారీ శాటిలైట్ పెలోడ్ బెలూన్ అని ఆలస్యంగా నిర్ధారించారు. దానిలో భారీ మెషిన్ ఉండటం, అలాగే రెడ్‌లైట్ ఒకటి వెలుగుతూనే ఉండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. దానిని క్షుణ్నంగా పరిశీలించగా, ఓ లెటర్ కనిపించింది. దానిని పరిశీలించగా, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్) హైదరాబాద్ సంస్థ నింగిలోకి వదిలినట్టు పోలీసులు గుర్తించారు.
ఇంతకూ ఈ బెలూన్ యంత్రాన్ని వాతావరణంపై అధ్యయనం చేయడానికి విడుదల చేశారని గుర్తించారు. దాని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు.