Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన శనివారమే ఏపీలోని గన్నవరం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు. ఏపీలోని కొండపావులూరు గ్రామంలోని ఎన్ఐడీఎం, ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్‌లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
Amit Shah: హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో నిర్మించిన షూటింగ్ రేంజ్‌కు మంత్రి అమిత్‌షా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్‌ను రూ.27 కోట్లతో నిర్మించనున్నారు. 50 మీటర్ల పొడవు, 10 వరుసలతో దీనిని నిర్మిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలు ఆధునిక సాంకేతిక పరిజ్క్షానంతో రూపొందించడం దీని ప్రత్యేకత.