Chandrababu P4 is Possible : డబ్బున్నవాళ్లు దత్తత తీసుకుంటే పేదలు బాగుపడతారన్నది P4 ఉద్దేశం కాదు. పేదలకు దారి చూపిస్తే, వాళ్లు సొంత కాళ్లపై నిలబడతారన్నదే ఈ P4 లక్ష్యం. జస్ట్ ఊహించుకోండి… ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉన్నాడు. చదువుకోవాలని కలలు కన్నాడు, కానీ పేదరికం అతని కాళ్లకు సంకెళ్లు వేసింది. ఇంట్లో తల్లి, చెల్లి… రోజూ కూలి పనికి వెళ్లకపోతే పూట గడవదు. అలాంటి రాముని.. P4 కింద ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సురేష్ కలుస్తాడు అనుకుందాం. సురేష్.. రాముకి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టలేదు. బదులుగా, “నీలో టాలెంట్ ఉంది, నీకు సరైన గైడెన్స్ కావాలి” అంటూ మోటివేట్ చేశాడు. రాముకి కంప్యూటర్ కోర్సు నేర్పించే ఏర్పాటు చేశాడు. 6 నెలల్లో రాము ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు అతని కుటుంబం సొంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. ఇదే P4 మ్యాజిక్!
ఈ కాన్సెప్ట్‌ని సింపుల్‌గా చెప్పాలంటే… చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పడం! అనమాట. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనం మన మైండ్‌సెట్ మార్చుకోవాలి. ఫ్రీ బీస్‌కు అలవాటైన ప్రజలు “ఇదేం స్కీమ్?” అనుకోవచ్చు. కానీ చంద్రబాబు ఆలోచన ఇందుకు భిన్నం. “నీకు ఉచితంగా ఇవ్వడం కాదు, నీ సత్తా బయటకు తీసుకొచ్చి నిన్ను గెలిపిస్తాను” అంటున్నారు. ఈ ఆలోచన పేదలకు అర్థమైతే, అర్థమయ్యేలా చెప్పగలితే… వాళ్లు దీన్ని ఒక అవకాశంగా చూస్తారు తప్ప భిక్షంగా చూడరు.
Chandrababu P4 is Possible: P4 ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నకు.. ముమ్మాటికి సాధ్యమే అని చెప్తున్నారు విశ్లేషకులు. కానీ రెండు వైపులా కృషి ఉండాలంటున్నారు. ఒకవైపు డబ్బున్న వాళ్లు పేద కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలి. మరోవైపు పేదలు… మాకు దారి చూపండి, మేమే ఎదుగుతాం అనే విధంగా మాత్రమే ఆలోచించాలి, ఆశించాలి. దీని ద్వారా ఒక గ్రామంలో పది కుటుంబాలు బాగుపడితే, ఆ గ్రామమే ఒక మోడల్ అవుతుంది. ఆ తర్వాత రాష్ట్రమంతా P4 ఉద్యమం వ్యాపిస్తుంది. కానీ పేదలు “ఎవరో వచ్చి మమ్మల్ని పోషిస్తారు” అనుకుంటే మాత్రం ఈ ఆలోచన విఫలమవుతుందని చెప్తున్నారు సామాజిక, ఆర్థిక రంగ నిపుణులు. అందుకే ముందు ప్రజల్లో అవగాహన కల్పించడం కీలకం అవుతోంది.
Also Read: Mukesh Ambani: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్.. మన దేశంలో ముఖేష్ అంబానీ!
ఈ P4 విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం అనే పదం చరిత్రలోనే మిగిలిపోతుంది. ఒక కుటుంబం సొంతంగా ఎదిగితే, ఆ సంతోషం ఆ కుటుంబంతో ఆగదు. గ్రామానికి, రాష్ట్రానికి వ్యాపిస్తుంది. చదువుకున్న యువత ఉద్యోగాలు సంపాదిస్తారు. స్కిల్స్ నేర్చుకున్నవాళ్లు ఉపాధి పొందుతారు. “పని చేస్తేనే పైకొస్తాం” అనే ఆలోచన సమాజంలో మొదలైతే అది సామాజిక విప్లవమే అవుతుంది.
“పేదరికం నీ శాపం కాదు, అది నీకు ఒక సవాల్! P4 అనేది నీకు అందుబాటులో ఉన్న ఒక నిచ్చెన. దాన్ని అందుకుని పైకి ఎదుగు!” ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న దారి. కానీ నడవాల్సింది ప్రజలే.