ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే.. 

ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు. మొత్తం 20 నామినేటెడ్ పోస్టులను ప్రకటించగా.. అందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చొప్పున కేటాయించారు. కూటమిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కున్న మూడు పార్టీలకు చెందిన నేతల్లో ఎన్నికల సమయంలో కూటమి విజయానికి దోహద పడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కినట్టు చెబుతున్నారు. జనసేన పార్టీ 5 నుంచి 7 పదవులను కోరింది. అయితే, కేవలం 3 పదవులు మాత్రమే దక్కాయి. 

నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే . . 

  1. వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
  2. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP)- అనిమిని రవి నాయుడు
  3. AP హౌసింగ్ బోర్డు – బత్తుల తత్తయ్య బాబు
  4. AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బోరగం శ్రీనివాసులు
  5. AP మారిటైమ్ బోర్డ్ – దామచెర్ల సత్య
  6. సీడప్ (ఏపీలో ఉపాధి కల్పన & సంస్థ అభివృద్ధి కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి
  7. 20 పాయింట్ ఫార్ములా – లంక దినకర్ (BJP)
  8. AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
  9. AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి
  10. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) – మంతెన రామరాజు
  11. AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య
  12. AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
  13. APSRTC ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ.. APSRTC వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం
  14. AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
  15. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు
  16. AP స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
  17. A.P. సూక్ష్మ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
  18. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
  19. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) – వజ్జా బాబు రావు
  20. AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (APTIDCO) – వేణుములపాటి అజయ కుమార్ (జనసేన)

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu Naidu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *