ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొత్తం 20 నామినేటెడ్ పోస్టులను ప్రకటించగా.. అందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చొప్పున కేటాయించారు. కూటమిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కున్న మూడు పార్టీలకు చెందిన నేతల్లో ఎన్నికల సమయంలో కూటమి విజయానికి దోహద పడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కినట్టు చెబుతున్నారు. జనసేన పార్టీ 5 నుంచి 7 పదవులను కోరింది. అయితే, కేవలం 3 పదవులు మాత్రమే దక్కాయి.
నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే . .
- వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజీజ్
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP)- అనిమిని రవి నాయుడు
- AP హౌసింగ్ బోర్డు – బత్తుల తత్తయ్య బాబు
- AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) – బోరగం శ్రీనివాసులు
- AP మారిటైమ్ బోర్డ్ – దామచెర్ల సత్య
- సీడప్ (ఏపీలో ఉపాధి కల్పన & సంస్థ అభివృద్ధి కోసం సొసైటీ) – దీపక్ రెడ్డి
- 20 పాయింట్ ఫార్ములా – లంక దినకర్ (BJP)
- AP మార్క్‌ఫెడ్ – కర్రోతు బంగార్రాజు
- AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – మన్నె సుబ్బారెడ్డి
- ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) – మంతెన రామరాజు
- AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ – నందం అబద్దయ్య
- AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
- APSRTC ఛైర్మన్ – కొనకళ్ల నారాయణ.. APSRTC వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం
- AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
- లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాల రావు
- AP స్టేట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
- A.P. సూక్ష్మ, చిన్న- మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (APMSME DC) – తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)
- ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) – వజ్జా బాబు రావు
- AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (APTIDCO) – వేణుములపాటి అజయ కుమార్ (జనసేన)