Vinayaka Chavithi 2025

Vinayaka Chavithi 2025: తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

Vinayaka Chavithi 2025: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజా పర్వదినం వినాయక చవితి (ఆగస్టు 27) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు సందేశం

ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు సందేశం విడుదల చేశారు. ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, ఆ గణనాథుడు అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఏర్పాటు చేసిన గణేశ మండపాల్లో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య పూజలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులందరికీ సకల శుభాలు కలగాలని కోరుకున్నారు. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖశాంతులను నింపాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ సందేశం

ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఏకకాలంలో జరుపుకునే అరుదైన హైందవ పండుగ వినాయక చవితి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతి భక్తుడు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని సూచించారు.

అలాగే ప్రజలు చేపట్టే అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడమని ఆ పార్వతీ తనయుడిని వేడుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని భక్తులకు పిలుపునిచ్చారు.

ఇద్దరి ఆకాంక్ష ఏకమే

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ ప్రజల జీవితాలలో శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి నిండాలని కోరుకుంటూ, ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *