Chandrababu: రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)ను మెరుగుపరచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో పీపుల్ (ప్రజలు), విజన్ (దృష్టి), నేచర్ (సహజ వనరులు), టెక్నాలజీ (సాంకేతికత) అంశాలకు పాలనలో అత్యున్నత ప్రాధాన్యత కల్పించాలన్న దిశగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
“ప్రతి రంగానికి ఓ స్పష్టమైన ఇండికేటర్ (సూచిక) ఉండాలి. అప్పుడే అభివృద్ధిని కొలవగలగడం సులభమవుతుంది. అలాగే నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని సీఎం స్పష్టం చేశారు.
నూతన పాలన విధానాల కోసం నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళిక విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. కార్యాలయాల మాదిరిగానే కార్యాచరణలు కూడా సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు
ఆగస్ట్ 15 నుంచి 700 సేవలు ఆన్లైన్లో
ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 700 ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తేనున్నట్లు సీఎం తెలిపారు. డిజిటల్ పాలన దిశగా ఇది పెద్ద అడుగు అవుతుదన్నారు.