Thandel: అక్కినేని నాగ చైతన్య ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక వెనక బడిన సంగతి తెలిసిందే. తాజాగా చైతూ చేసిన తండేల్ సినిమా విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. చైతూ కెరీర్లో ఛాలెంజింగ్ రోల్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలకి తగ్గట్లు గానే ఆకట్టుకుందని టాక్. ఈ సినిమా 1 డే బుకింగ్స్ మార్నింగ్ షోస్ నుంచి బాగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Eggs: ఆ వ్యాధితో బాధపడేవారు ఖచ్చితంగా గుడ్లు తినకపోవడమే మంచిది!
ఇక ఎప్పుడైతే పాజిటివ్ టాక్ బయటకి వచ్చిందో బుక్ మై షోలో బుకింగ్స్ ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. గంటకి 11 వేలకి పైగా టికెట్స్ బుకింగ్స్ తో సూపర్ ట్రెండింగ్ లో తండేల్ దూసుకుపోతుంది. దీనితో తండేల్ ర్యాంపేజ్ ఇక స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ సంగీతం అందించగా, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు.