Akkineni Family: అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య, శోభిత దూళిపాల వివాహ మహోత్సవం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి వేడక డిసెంబర్ 4న కనీవినీ ఎరుగని రీతిలో జరిపేందుకు ఇరు కుటుంబాలు రెడీ అయ్యాయి. సుమారు 22 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో.. ఈ వేడుక నిర్వహణకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ పెండ్లి కోసం భారీ సెట్ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. స్టూడియోను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
Akkineni Family: ఇప్పటికే చైతూ, శోభిత పెళ్లి వేడుకలు సంప్రదాయబద్ధంగా మొదలయ్యాయి. తొలిదైన పసుపు కార్యక్రమాన్ని ఇప్పటికే సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, పూజలతో ఈ కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. దీంతో ఈ పెండ్లి వేడుకల్లో ఒక ఘట్టం పూర్తయిందన్నమాట. ఇక ఇప్పుడు అంతా వివాహ వేడుక, గెస్టులు, వంటలపై ఆరా తీసే పనిలో నాగార్జున కుటుంబం ఉన్నట్టు సమాచారం.
Akkineni Family: చైతూ, శోభిత పెండి వేడుకకు ముఖ్యంగా సినీ ప్రముఖులు హాజరుపై ఆసక్తి నెలకొన్నది. నాగార్జున ఫ్యామిలీ ఎవరెవరిని పిలుస్తున్నది, ఎవరెవరు మెరువనున్నారు అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ గెస్టుల జాబితాను సిద్ధం చేసినట్టు వినికిడి. ఈ మేరకు ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, మహేశ్‌బాబు ఫ్యామిలీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, రణబీర్‌కపూర్ కుటుంబాలను ప్రముఖంగా ఆహ్వానించాలని అనుకున్నారట.
Akkineni Family: ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఇతర దర్శకులు, నిర్మాతలు, వివిధ విభాగాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపే జాబితాను సిద్ధం చేసి ఉంచారని సమాచారం. రాజకీయ ప్రముఖుల్లో కొందరినే ఆహ్వానిస్తారని, లేనిపోని వివాదాలు కొనితెచ్చుకోవద్దని ఆ కుటుంబం భావించిందని అంటున్నారు. ఈ మ్యారేజ్ ఈవెంట్ నిర్వహణకు ఇటు అక్కినేని, అటు శోభిత కుటుంబాలు ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు తెలిసింది.