YS Sharmila

YS Sharmila: అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు.. మీకు ఓట్లేసింది ఇందుకేనా

YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అయ్యారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ? మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే… ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం అన్ని. 

ఇది కూడా చదవండి: AP Budget 2024: బడ్జెట్ సమావేశాలు లైవ్..

YS Sharmila: కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే… ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు అని అన్నారు షర్మిల. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో  కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. 

ఇది కూడా చదవండి: AP Budget 2024: పయ్యావుల పద్దు.. ఆశల పొద్దు.. ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇవే!

YS Sharmila: హోదా లేకున్నా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి అని వైస్ షర్మిల అన్నారు.

ALSO READ  Kadapa SP Transfer: కడప ఎస్పీ ఆకస్మిక బదిలీ..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *