Manipur AFSPA: మణిపూర్‌లోని 5 జిల్లాల్లోని 6 పోలీసు స్టేషన్లలో సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టం (AFSPA) మళ్లీ అమల్లోకి తీసుకువచ్చారు. ఇది 31 మార్చి 2025 వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాంతాల్లో శాంతిభద్రతలు క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. AFSPA అమలుతో, సైన్యం, పారామిలటరీ బలగాలు ఈ ప్రాంతాల్లో ఎప్పుడైనా ఎవరినైనా ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Harish Rao: లగచర్ల ఘటనపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
Manipur AFSPA: హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సెక్మాయ్ .. లాంసాంగ్ పోలీస్ స్టేషన్లు, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్లై, జిరిబామ్ జిల్లాలోని జిరిబామ్, కాంగ్‌పోక్పిలోని లీమాఖోంగ్ .. బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ పోలీస్ స్టేషన్‌లను కవర్ చేస్తుంది. AFSPA శాంతి భద్రతలు పట్టు తప్పిన ప్రాంతాల్లో మాత్రమే అమలు అవుతుంది. ఈ ప్రదేశాలలో, భద్రతా దళాలు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయవచ్చు.