Gold Rate: అమెరికా అధ్యక్ష ఎన్నికలు బంగారం ధరల పై భారీ ఎఫెక్ట్ చూపించింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన క్రమంలో బంగారం ధరల్లో కీలక మార్పులు జరిగాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటందని, డాలర్ విలువ పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో అక్కడి బాండ్ ఈల్డ్స్, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారానికి గిరాకీ తగ్గి ధరలు పడిపోతున్నాయి.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2607 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ఒక ఔన్సుకు 30.91 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ రూపాయి మారకం విలువ రూ.84.381 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 69 వేల 350 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు రూ. 75వేల 890 వద్దకు పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69 వేల 350 వద్దకు పడిపోయింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 76 వేల 025 పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర l రూ. 69 వేల 350 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 75 వేల 830గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ.110 దిగివచ్చి రూ. 75 వేల 93pగా ఉంది.