Ambati Rambabu: గుంటూరులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిని బెదిరించారని ఆరోపిస్తూ పట్టాభిపురం పోలీసుస్టేషన్లో ఆయనతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు.

