Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు రాహుల్ గాంధీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఇండియా కూటమి నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఈ తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు. ఈ ఇద్దరికి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంత్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా రాహుల్ గాంధీ సహా మరికొందరిపై బీఎన్ఎస్ సెక్షన్లు 115, 117, 131, 351 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
దీనికి ప్రతిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు మరికొందరు నేతలు తోపులాటలో గాయపడ్డారని, బీజేపీ ఎంపీల దౌర్జన్యమే కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై ఇప్పటివరకు బీజేపీ ఎంపీలపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
డీసీపీ (న్యూఢిల్లీ) దినేశ్ మహ్లా మాట్లాడుతూ కాంగ్రెస్ ఫిర్యాదును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఇరుపక్షాలు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు