Ap news: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఈ కేసును పెట్టాడు.
ఇక రామలింగం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాంగోపాల్ వర్మ కలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అప్పట్లో అవి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఏపీలో 2019 ఎలక్షన్స్ సమయంలో నాయకులు ఉపయోగించిన మాటలను తన సినిమాలో పెట్టాడని నేతలు పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం అప్పుడు వ్యూహం సినిమాలో సీఎం చంద్రబాబుని తప్పుగా చూపించాలని టీడీపీ నేతలు పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు.