Nizamabad: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై కేసు నమోదైంది. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ వద్ద ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకి, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలో, అపార్ట్‌మెంట్ వాసులు చేసిన ఫిర్యాదుకు ఆధారంగా రామ్ కిషన్ రావుపై కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం, గోపి అనే అపార్ట్‌మెంట్ వాసి ఫిర్యాదు చేసిన మేరకు, కొంతమంది వ్యక్తులు రోడ్డు స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నించారని, ఈ క్రమంలో బెదిరింపులకు గురైనట్టు చెప్పారు. అలాగే, రామ్ కిషన్ రావు అనుచరులు గోపిని కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. దీంతో, రామ్ కిషన్ రావు, నగేశ్ కుమార్, కార్పొరేటర్ సోదరుడు సుదామ్ రామ్ చంద్, తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక నగేశ్ కుమార్, ఈ స్థలం తనదేనని, తాను దాన్నికి లీగల్ రిజిస్ట్రేషన్ పత్రాలతో కొనుగోలు చేశానని ప్రకటించారు. ఆయన ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు, తద్వారా మరొక కేసు నమోదు అయింది.