Magnus Carlsen: టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ రెండో టైటిల్ అందుకున్నడు. ఇప్పటికే ర్యాపిడ్‌లో విజేతగా నిలిచిన కార్ల్ సన్ బ్లిట్జ్‌లోనూ మరో రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం చేసుకున్నాడు. 18 రౌండ్లు ముగిసే సరికి 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 2019లోనూ ఈ టోర్నీలో కార్ల్‌సన్ ఈ రెండు టైటిళ్లను దక్కించుకున్నాడు. కాగా, 11.5 పాయింట్లతో రెండోస్థానంలో వెస్లీ సో నిలవగా, 10.5 పాయింట్లతో అర్జున్ ఇరిగేశి, 9.5 పాయింట్లతో ప్రజ్ఞానంద , 9 పాయింట్లతో విదిత్ వరుసగా మూడు నుంచి అయిదు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో కేథరీనా లాగ్నో 11.5 పాయింట్లతో ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత క్రీడాకారిణుల్లో వంతిక 9.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. కోనేరు హంపి 9 పాయింట్లు, ద్రోణవల్లి హారిక 8.5 పాయింట్లతో వరుసగా ఆరు, ఏడు స్థానాలతో ముగించారు.
