Convoy Collision: జైపూర్‌లో, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కాన్వాయ్‌లోకి టాక్సీ దూసుకువచ్చింది. ఈ టాక్సీ ముందుకు వెళుతున్న రెండు వాహనాలను ఢీకొట్టింది. దీంతో జరిగిన ప్రమాదంలో 1 ఏఎస్‌ఐ మృతి చెందగా, నలుగురు పోలీసులు, ట్యాక్సీ డ్రైవర్‌తో సహా 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ముఖ్యమంత్రి భద్రత లోపం వెలుగులోకి వచ్చింది. జగత్‌పురలోని అక్షయపాత్ర కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు మధ్యాహ్నం 3 గంటలకు కాన్వాయ్ సీఎం ఇంటి నుంచి బయలుదేరింది. లఘు ఉద్యోగ్ భారతి సోహన్ సింగ్ స్మృతి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్తున్నారు.
ఇది కూడా చదవండి: Maharastra: అంబేద్కర్ స్మారకం విధ్వంసం.. చెలరేగిన హింస!
Convoy Collision: ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అక్షయపాత్ర కూడలిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడి నుంచి సీఎం కాన్వాయ్ వెళ్తుండగా, రాంగ్ సైడ్ నుంచి ట్యాక్సీ నంబర్ గల కారు వచ్చింది. ఏఎస్ఐ సురేంద్ర సింగ్ టాక్సీని ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ అతనిని ఢీకొట్టాడు. అనంతరం సీఎం కాన్వాయ్‌లోని వాహనాలను ట్యాక్సీ ఢీకొట్టింది. ఘటనకు కారణాలపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

