Pithapuram: కాకినాడ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలో 364.93 చ.కి.మీ. విస్తీర్ణంలో పిఠాపురం నియోజకవర్గం ఉంది. కేఎస్ఈజెడ్ కోసం ఈ ప్రాంతంలో 10 వేల290 ఎకరాలు కేటాయించారు. కొత్తపల్లి మండలంలో కొమరగిరి నుంచి కోనపాపపేట వరకు 15 కిలోమీటర్ల తీరం ఉంది. మరో కొన్ని రోజుల్లో మూలపేట సమీపంలో నిర్మాణం జరుగుతున్న పోర్టు కూడా పిఠాపురం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వ పోర్టును ప్రైవేట్ సంస్థ దక్కించుకోవడంతో ఆ పోర్టు ద్వారా భారీ స్థాయిలో ఇతర దేశాలకు ఎగుమతులు దిగుమతులు ఉండే అవకాశం ఉంది.
భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, దేశంలోనే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ ప్రాంతంపై తనదైన ముద్రను బలంగా వేస్తున్నారు.
పిఠాపురంపై పవన్ మార్కు
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు…
పాడా(PADA)పరిధిలోకి రెండు పట్టణాలు, 52 గ్రామాలు…
సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధికి శ్రీకారం…
అభివృద్ధికి రూ.38.32కోట్లు కేటాయింపు…
అదనంగా సుమారు 66 పోస్టులు మంజూరు…
మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం ప్రతిపాదనలకు ఆమోదం
అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, దేశంలోనే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేయడమేగాక ఈ ప్రాంతంపై తనదైన ముద్రను బలంగా వేస్తున్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు, ప్రస్తుతం 30 పడకల ఆస్పత్రిగా ఉన్న సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు నిధులు, అదనపు పోస్టుల మంజూరుకు చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గ ఆమోదం లభించింది.
తనను శాసనసభ్యుడిగా గెలిపించి అసెంబ్లీకి పంపడమేగాక డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టడంతోపాటు రాష్ట్రంలో, దేశంలో బలంగా నిలిపిన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, ఎన్నికల తర్వాత పిఠాపురం సభలో ప్రకటించిన పవన్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.
5 రోజుల క్రితమే గొల్లప్రోలు సభలో తాను ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, జరుగుతున్న, జరగబోయే పనుల గురించి వివరించారు. అన్నట్లుగానే అన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. గొల్లప్రో లు సభలో పవన్ ప్రకటించిన 48గంటలు గడవక ముందే కీలకమైన రెండు అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
పిఠాపురం సమగ్రాభివృద్ధికి పాడా
పిఠాపురం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ(పాడా) ఏర్పాటు ప్రతిపాదనను పవన్ ముందుకు తీసుకువచ్చారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతోపాటు పిఠాపురం మండలంలోని 24 గ్రామాలు, గొల్లప్రోలు మండలంలోని 10 గ్రామాలు, కొత్తపల్లి మండలంలోని 18 గ్రామాలు మొత్తం 52 గ్రామాలను పాడా పరిధిలోకి తీసుకువచ్చారు. పిఠాపురం ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచారశాఖా మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు.
క్యాబినెట్ సమావేశంలో పవన్ ద్వారా వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం ల భించింది. పాడా ఏర్పాటువల్ల ఇప్పటి వరకూ కాకినాడ ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ అథారటీ(కుడా) పరిధిలో ఉన్న ఈ రెండు పట్టణాలు, 52 గ్రామాలు పాడా పరిధిలోకి వస్తాయి. దీనివల్ల వీటిని పాడా ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది.
పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ప్లాన్స్, లేఅవుట్లు ఆమోదం రుసుం, ఇతరత్రా మార్గాల్లో పాడాకు ఆదాయం వస్తుంది. పట్టణాభివృద్ధి సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నాయి. మరోవైపు పాడా వైస్‌చైర్మన్‌గా ఆర్డీవో స్థాయి అధికారిని నియమిస్తారు. చైర్మన్‌గా అనధికారలను నియమించే వరకూ జిల్లా కలెక్టర్ లేదా జేసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు..
పిఠాపురం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో అందులో పాడా ఏర్పాటు కీలకంగా మారనుంది. ఇప్పటికే రుడా, ఉడా,కుడాలకు గతంలో ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ లు రూపొందించారు. పాడా పరిధి లోకి వచ్చే ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. దీనివల్ల నియోజకవర్గం యూనిట్‌గా ఉం టుంది. కొత్తపల్లిలోని సముద్రతీరం, సెజ్ భూములు ఉన్న ప్రాంతాలు పాడా పరిధిలోకే రానున్నాయి.
మారనున్న ప్రభుత్వాస్పత్రి రూపురేఖలు
ప్రస్తుతం 30 పడకల ఆస్పత్రిగా ఉన్న పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇక్కడ సీహెచ్‌సీ స్థానంలో ఏరియా ఆస్పత్రి ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు అనుగుణంగా అదనపు భవనాల నిర్మాణం, స్కానింగ్, ల్యాబ్స్ వంటి అత్యాధునిక సదుపాయాల కల్పనకు, ఇతర మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రూ.38.32కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. అదనంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర నిపుణులు, స్టాఫ్‌నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది మొత్తం 66 పోస్టులను మంజూరు చేశారు.
పిఠాపురం నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు కూడా అత్యధికంగా రోగులు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు సరిపోవడం లేదు. 30 పడకల ఆస్పత్రి అయిన కొవిడ్ సమయంలో దాతల సహకారంతో సమకూర్చిన బెడ్‌లు, ఇతరత్రా వచ్చిన బెడ్‌లు కలిపి మరో 30 పడకలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినా వైద్యులు, సిబ్బంద సరిపడా లేకపోవడంతో ఇటీవల పవన్‌కల్యాణ్ ఆదేశాలతో అదనంగా ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక స్టాఫ్ అటెండెంట్‌ను నియమించారు.
సీఎస్‌ఆర్ నిధులతో ఎక్స్‌రే సిస్టము అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో కొంతవరకూ ఇబ్బందులు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు 100 పడకల ఆస్పత్రిగా మారనున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్‌స్థాయిలో పిఠాపురం ఆస్పత్రిని తీర్చిదిద్దుతానని ఎన్నికల ముందు,తర్వాత ప్రకటించిన పవన్‌కల్యాణ్ అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఆమోదం పొందడంతో ఇక అప్‌గ్రేడేషన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
మరి ముఖ్యంగా పిఠాపురంలో పవిత్ర పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో 10 వ శక్తిపీఠమైన పురోహిత అమ్మవారు వెలిసిన ప్రాంతం అవడం మరోవైపు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జన్మస్థానం అవడం పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యమని అటువంటి ప్రాంతాన్ని టెంపుల్ సిటీ గాను తీర్చిదిద్ది దేశమంతా చూసే విధంగా పిఠాపురం మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ హామీకి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కూడా ఆమోదం రావడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పిఠాపురం ప్రజలు భావిస్తున్నారు.
పవన్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే
ప్రతి రెండు వారాలకు కలెక్టర్ షాన్మోహన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. అర్జీలపై వెంటనే స్పందిస్తున్నారు. గ్రామీణ రోడ్లకు రూ.10 కోట్లు, ర.భ రహదారుల మరమ్మతులకు రూ.3 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ బస్టాండును అభివృద్ధి చేశారు.
విమానాశ్రయం కూడా జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం లోని ఏర్పాటు చేసే విధంగా పౌరు విమానాయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. విమానాశ్రయం కూడా పిఠాపురం సమీపంలోనే వస్తే చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు కూడా పిఠాపురం వరకు వచ్చి వాయు మార్గంగా ప్రయాణం చేయవలసి వస్తది దీంతో మరింత సందడి వాతావరణం పిఠాపురంలో నెలకొంటుంది. దీంతో అంతర్జాతీయంగా కూడా పిఠాపురానికి మరింత గుర్తింపు లభిస్తుంది.
తీరం వెంబడి కోతకు గురవుతున్న ప్రాంతాన్ని అత్యధిక టెక్నాలజీని వినియోగించి తీర ప్రాంతం కోతను నివారించే విధంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 200 కోట్ల పైబడితో ప్రణాళికను అధికారులు రూపుదిద్దుతున్నారు అతి త్వరలోనే వీరప్రాంత స్వాతం కూడా పూర్తిగా నివారిస్తారని పిఠాపురం ప్రజలు దిమా వ్యక్తం చేస్తున్నారు. వీర ప్రాంతం కోత నివారణ అద్దిగట్ట వేస్తే రాష్ట్రంలోనే పిఠాపురం తీర ప్రాంతమంతా టూరిజం అబ్బుగా మారను
పిఠాపురం అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా పవన్ తీసుకుంటున్న చర్యలపట్ల , మా పిఠాపురం ప్రజలంతా ఎంతో అదృష్టం చేసుకున్నామని. సాక్షాత్తు కలియుగ దేవుడే మా పిఠాపురం వచ్చినట్లు ఉందని పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.