Hyderabad:ఎక్కడి ప్రయాణికులు అక్కడే ఉన్నారు.. ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు.. కానీ ఓ ప్రయాణికురాలి బ్యాగులో నగలు చోరీ అయ్యాయి. లబోదిబోమనడం ఆమె వంతయింది. మరి ఆ దొంగతనం చేసింది ఎవరు? ఎలా జరిగింది? దొంగలు ఎటు వెళ్లారు? ఏమై ఉంటారు? అన్న విషయం తేల్చుకునేందుకు ఏకంగా ఆ బస్సు డ్రైవర్ బస్సును డైరెక్ట్‌గా పోలీస్‌స్టేషన్‌లోపలికే తీసుకెళ్లాడు. జరిగిన చోరీ గురించి చెప్పుకున్నారు. ఇదన్నమాట.
Hyderabad:అసలేం జరిగిందంటే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మండపేట నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు 40 మంది ప్రయాణికులతో వస్తున్నది. శుక్రవారం తెల్లవారుజామున ఆ బస్సులో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగులో ఉన్న రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు మహిళ జరిగిన విషయం ప్రయాణికులకు, డ్రైవర్‌కు తెలిపింది.
Hyderabad:దీంతో డ్రైవర్ సమయస్ఫూర్తితో ఏకంగా బస్సును హైదరాబాద్ సమీపంలోని మార్గమధ్యంలో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ లోపలికి తీసుకెళ్లాడు. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి 40 మంది ప్రయాణికులను పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. ఇంకా దొంగెవరో తేలలేదు.