Hyderabad: హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలో చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపి, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన కారణంగా కూకట్‌పల్లి, పంజాగుట్ట మధ్య ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో మెట్రో సర్వీసులు ముగిసి ఉండటంతో మెట్రో స్టేషన్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే స్టేషన్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ యాక్సిడెంట్ కి బస్ ఫిట్నెస్ లోపం కారణమని తేలితే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్ వెల్లడించారు. . ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని వివరించారు. బస్సులో ప్రయాణిస్తున్న అందరూ సేఫ్ గా ఉన్నారని చెప్పారు.
Also Read: Heavy Rains: నేడు తెలంగాణకు అతి భారీ వర్షసూచన
Fire scare at #SRNagar Metro
A #Vijayawada-bound #privatebus from #Miyapur suddenly caught fire right under SR Nagar #Metro station.
Alert #driver stopped the #bus & evacuated all #passengers safely before #flames spread.#Fireengines on spot controlling blaze.… pic.twitter.com/D50JmVQfRT
— NewsMeter (@NewsMeter_In) September 25, 2025