Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియామక పత్రంపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేస్తూ ఆమోదం తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన ప్రస్తుత కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీకాలం ముగియనున్నది. అనంతరం బుర్రా వెంకటేశం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా 2030 డిసెంబర్ వరకు కొనసాగుతారు.
