Fire accident: ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 200 ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. స్థానికులు వెంటనే ఫైల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో, 12 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయపడాయి.
ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడం నిర్ధారించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు తలెత్తినట్లు తెలుస్తోంది. కాలిపోయిన వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవని అధికారులు తెలిపారు. రెండు గంటల పాటు జరిగిన కష్టశ్రమ అనంతరం మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.