Bulli Raju: తన డైలాగ్ డెలివరీ.. కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ అయిపోయాడు బుల్లిరాజు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో బుల్లి రాజుకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం 4సినిమాలలో అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే బుల్లి రాజు రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇంత చిన్న వయసులోనే ఆ రేంజ్ డిమాండ్ అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. టాప్ కమెడియన్స్ కూడా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం బుల్లి రాజుకి ఉన్న డిమాండ్ కారణంగా నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంత చిన్న వయసులోనే స్టార్ సెలబ్రిటీల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది బుల్లి రాజు టాలెంట్ ఏంటో నిరూపిస్తుంది. మరి ఈ బుడ్డోడు మున్ముందు రోజుల్లో ఇంకెంత బాగా అల్లరిస్తాడో చూడాలి.