Koushik Reddy: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి తీవ్ర గాయాలు

Koushik Reddy: బీఆర్ఎస్ పార్టీకి చెందిన క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పోలీసుల తోపులాట‌లో స్ప్ర‌హ‌త‌ప్పి ప‌డిపోయారు. ద‌ళిత బంధు రెండో విడుత ల‌బ్ధిదారుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కోరుతూ ల‌బ్ధిదారుల‌తో క‌లిసి ఆయ‌న హుజూరాబాద్‌లో శ‌నివారం ధ‌ర్నాకు దిగారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు ఆయ‌న‌ను బ‌ల‌వంతంగా లాక్కెళ్లి అదుపులోకి తీసుకొని కారులోకి ఎక్కంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో జ‌రిగిన తోపులాట‌లో ఆయ‌నకు తీవ్ర‌గాయాల‌య్యాయి.

Koushik Reddy: అనంత‌రం కారులో త‌ర‌లిస్తుండ‌గా, ఆయ‌న ఆయాస ప‌డుతూ తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఆ త‌ర్వాత స్ప్ర‌హ‌త‌ప్పి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో వెంట‌నే కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను పోలీస్ కారులోంచి ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు చికిత్స అందుతున్న‌ది. ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది. దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తారా?

Koushik Reddy: ద‌ళిత బంధు నిధులు అడిగితే లాఠీచార్జి చేస్తారా? దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తారా? అని ఆ త‌ర్వాత తేరుకున్న పాడి కౌశిక్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ద‌ళిత బిడ్డ‌ల కోసం త‌న ప్రాణం పోయేంత వ‌ర‌కూ పోరాడుతా అని పాడి ఆస్ప‌త్రి బెడ్‌పై నుంచే ప్ర‌తిన‌బూనారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *