BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీలో వినూత్న నిరసనకు దిగారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చిన వారంతా లగచర్ల రైతులకు మద్దతుగా చేతులకు బేడీలు వేసుకొని నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. అయితే అసెంబ్లీ సమావేశం ప్రారంభం నుంచి లగచర్ల రైతుల అంశాన్ని లెవనెత్తాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నది. నెలరోజులుగా జైలులో మగ్గుతున్న రైతుల అంశంపై బయట, అసెంబ్లీలో లేవనెత్తింది. అయినా ప్రభుత్వం నుంచి సరైన వైఖరి లేనందున ఈ నిరసనకు దిగినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు.
BRS: లగచర్ల రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లచొక్కాలు ధరించి, చేతులకు బేడీలు వేసుకొని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లూటీ రాజ్యం, రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు.. అన్న నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీ లోపలి నుంచి బయటకు వచ్చారు. వీరిలో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర ఎమ్మెల్యేలు గంగుల ప్రతాప్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాగంటి గోపీనాథ్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.