Bringing Gold from Abroad

Bringing Gold from Abroad: విదేశాల నుంచి బంగారు నగలు వేసుకొస్తే ఏమవుతుంది? అలా నగలు వేసుకుని రావచ్చా?

Bringing Gold from Abroad: విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఒంటిపై నగలు గా బంగారం ఉంటే ఏమి చేస్తారు? చాలామందికి ఉండే డౌట్ ఇది. నగలుగా కూడా పరిమితికి మించి బంగారం ధరించడం కుదరదు. 

రూల్స్ ప్రకారం బంగారం తీసుకురావడంపై ఎక్కడా ఆంక్షలు లేవు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోతేనే స్మగ్లింగ్ కిందనో.. అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించి సీజ్ చేస్తారు అని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.‘‘ఎవరైనా విదేశాల్లో ఆరు నెలల్లోపే ఉండి తిరిగి వచ్చేప్పుడు బంగారం తీసుకువస్తే 38.5శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి.

ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఉండి తిరిగివస్తే 13.75శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇందులో మగవారు 20గ్రాములు, ఆడవారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకుని రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతులలో తీసుకువస్తుంటారు. కొద్ది కాలం అక్కడ ఉండి పావు కిలో నుంచి కిలో వరకు తీసుకువస్తుంటారు. అలాంటప్పుడు 38.5శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే సీజ్ చేస్తారు. కిలోకు మించి తీసుకువస్తే అరెస్టు చేస్తారు.

ఇటీవల ఇలా బంగారం తెచ్చే విషయంలో చెన్నై హైకోర్టులో ఒక కేసు వచ్చింది. చెన్నైకి చెందిన సబీనా మొహమ్మద్ మొయిదీన్  శ్రీలంకకు చెందిన ధనుషిక 2023లో విదేశాలకు వెళ్లి చెన్నైకి తిరిగి వచ్చారు. వారిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.

ఇది కూడా చదవండి: Vidya Sagar: మళ్లీ అరెస్ట్ అయిన కుక్కల విద్యాసాగర్

సబీనా ధరించిన 135 గ్రాముల బరువున్న 10 బంగారు గాజులను, ధనుషిక ధరించిన 88 గ్రాముల టాలిస్మాన్ గొలుసును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కస్టమ్స్ అధికారులు జప్తు చేసిన బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ సబీనా, ధనుషిక ఇతరులు దావా వేశారు.

ఈ కేసులను విచారించిన న్యాయమూర్తి కృష్ణన్ రామసామి, ‘వారు బంగారు ఆభరణాలను రహస్యంగా  తీసుకురాలేదు; వాళ్ళు దాన్ని వేసుకుని వచ్చారు. శరీరంపై ధరించే ఆభరణాలను ఆస్తిగా పరిగణించలేము  కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉండాలని చెప్పలేము. వాటిని తిరిగి ఇవ్వాలి. అని తీర్పు చెప్పారు. దీనిపై కస్టమ్స్ శాఖ దాఖలు చేసిన అప్పీల్‌ను ఇటీవల జస్టిస్‌లు ఎస్.ఎస్. సుందర్, సి. శరవణన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

కస్టమ్స్ విభాగం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎ.ఆర్.ఎల్. సుందరేశన్ మాట్లాడుతూ, “లగేజీ నిబంధనల ప్రకారం, రూ. 50,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను ఆస్తిగా పరిగణిస్తారు. పన్ను వసూలు చేయాలి” అని అన్నారు.

“శరీరంపై ధరించే ఆభరణాలను ఆస్తిగా పరిగణించరాదని ఆదేశం జారీ చేస్తే, అది దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.” “సింగిల్ జడ్జి ఆదేశాన్ని నిలిపివేయాలి” అని ఆయన కోర్టును కోరారు. 

కస్టమ్స్ శాఖ వాదనను న్యాయమూర్తులు అంగీకరించి, ఈ కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బాండ్ లేదా గ్యారెంటీతో తిరిగి ఇవ్వాలని కూడా వారు ఆదేశించారు.అదీ విషయం.. విదేశాల లో భలే చవక అని బంగారం నగలు దిగేసుకు వస్తే.. ఆనక దిగాలు పదాల్సి వస్తుంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *