Breaking News:కృష్ణా నది పరవళ్లతో తాజాగా అతి ముఖ్య సమాచారం వచ్చింది. వరద ప్రవాహంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు వడివడిగా నిండుతున్నాయి. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు ఇప్పటికే నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఆ ప్రాజెక్టుల నుంచి తాజాగా 1.88 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు మొత్తం గేట్లను తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Breaking News:శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ఇప్పటికే 878 అడుగులకు చేరుకున్నది. ఈ మేరకు జూలై 8, 9 తేదీల్లో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కూడా నిండే అవకాశం ఉండటంతో 10 నాటికి సాగర్ 26 క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతారు.