Brahma Anandam OTT: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నిఖిల్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘బ్రహ్మ ఆనందం’. మరి డీసెంట్ ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ గా మిగిలింది. ఇపుడు ఈ సినిమా ఓటిటిలో అలరించేందుకు వచ్చేసింది.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నేటి నుంచి అందులో అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఈరోజు కేవలం ఆహా గోల్డ్ ని వినియోగించేవారికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. నార్మల్ సబ్ స్క్రైబర్స్ కి రేపు మార్చ్ 20 నుంచి అందుబాటులో ఉండనుంది. కాబట్టి వారు రేపటి నుంచి చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి శాండిల్య పీసపాటి సంగీతం అందించగా స్వధరం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. మరి ఈ సినిమా ఓటిటిలో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
