F1

F1: బ్రాడ్ పిట్ ‘ఎఫ్1’ సంచలనం! ఇండియాలో రికార్డు కలెక్షన్లు!

F1: హాలీవుడ్ నుంచి వచ్చిన రేసింగ్ థ్రిల్లర్ ‘ఎఫ్1’ భారత బాక్సాఫీస్‌లో దూసుకెళ్తోంది. సీనియర్ హీరో బ్రాడ్ పిట్ నటనతో ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. జోసెఫ్ కొన్సిస్కి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తొలి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్‌తో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్‌ను అందుకుంది. సూపర్ హీరో లేదా ఫ్రాంచైజ్ సినిమా కాకపోయినా, ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం విశేషం. యువ నటుడు డామ్సన్ ఐడ్రిస్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఐమాక్స్ స్క్రీన్స్‌లో ఈ సినిమా థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తోంది. సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది. ఫైనల్ రన్‌లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *