Allu Arjun: నిజం గడపదాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్నది నానుడి. అల్లు అర్జున్ కి సంబంధించిన కేసులోనూ అదే జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన పాత్ర గురించి అర్థసత్యాలు, అసత్యాలే ఎక్కువగా ప్రచారం సాగాయి. అసలు వాస్తవాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరుగా గొంతు విప్పే పరిస్థితి వస్తుంది. అందులో టాలీవుడ్ ప్రముఖుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకూ స్వరం పెంచుతున్నారు.
Allu Arjun: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అల్లు అర్జున్ ను ఏకపక్షంగా నిందించడం తగదంటూ వ్యాఖ్యానించారు. ఆయనే దోషి అన్నట్టుగా చిత్రీకరించడం తగదన్నారు. ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం సరికాదన్నారు. అదే సమయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా అదే రీతిలో వ్యాఖ్యానించారు. సినిమా అంటే హీరోకే సంబంధం అన్నట్టుగా ప్రత్యక్ష ప్రమేయం లేని ఘటనలో అల్లు అర్జున్ ను వేధించారన్నట్టుగా మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Game Changer: గేమ్ చేంజర్ ట్రైలర్ లో ప్రతి షాట్ అద్భుతం రాజమౌళి
Allu Arjun: తాజాగా ఎన్ హెచ్ ఆర్ సీ కూడా కదిలింది. తెలంగాణా డీజీపీ, సిటీ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించింది. లాఠీఛార్జ్ చేసిన తీరు మీద ఆగ్రహించింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానలు ఇవ్వాలని ఆదేశింది. దాంతో పోలీసు భద్రతా వైపల్యం బయటపడే అవకాశం ఉంది. సీనియర్ అడ్వకేట్ పిటీషన్ తో ఎన్ హెచ్ ఆర్ సీ జారీ చేసిన నోటీసుల అంశం పోలీసుల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.
Allu Arjun: ఇప్పటి వరకూ అల్లు అర్జున్ ను బద్నాం చేస్తూ సాగించిన ప్రచారానికి ఈ పరిణామాలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ అదే సమయంలో ఇంటర్నేషనల్ గా ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్ కి ఇవన్నీ చేటు తెస్తాయనే వాదన బలపడుతోంది. సినిమా ఇండస్ట్రీకి హబ్ మారబోతున్న నగరంలో ఓ సెలబ్రిటీ మీద అతిగా ఫోకస్ చేసి మొత్తం నగరానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ప్రమేయం లేకపోయినా కేసుని ఆయన మెడకు చుట్టాలన్న యత్నంలో మొత్తం టాలీవుడ్ లోనే అలజడి రాజేసిన తీరుని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి చర్యలు శ్రేయస్కరం కాదని ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్న తరుణంలో యంత్రాంగం తీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది.