Vijay Deverakonda: ‘ఫ్యామిలీ స్టార్’ పరాజయం నుండి నిదానంగా కోలుకుని విజయ్ దేవరకొండ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ, మరొకటి రాహుల్ సాంకృత్యన్ తోనూ ఉండబోతున్నాయి. విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ మార్చిలో విడుదల కావాల్సింది. కానీ అదే సమయానికి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విడుదల అవుతుండంతో దీనిని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీని కాస్తంత నిదానంగా తీస్తున్నారు. దీనికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండతో రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించబోతున్న మూవీకి హిందీ సినిమా ‘ఆదిపురుష్’ సంగీత ద్వయం అజయ్ – అతుల్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సహజంగా విజయ్ దేవరకొండ సినిమాలంటే మ్యూజికల్ గానూ మంచి విజయం సాధిస్తుంటాయి. మరి ఈ రెండు సినిమాలు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.