Bolivia: బొలీవియా దేశంలో ఈ రోజు (ఫిబ్రవరి 18న) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఆ దేశంలోని పొటోషి సమీపంలో లోయలో బస్సు పడపోయి ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. విచిత్రమేమిటో కానీ, బొలీవియా దేశంలో ప్రతి ఏటా జరిగే ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం పాలవుతూ ఉంటారు.
Bolivia: పొటోషి లోయలో బస్సు ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో మరో 14 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. ఆ దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది జూలైలో ఇదే పొటోషి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలయ్యారు.
Bolivia: బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఓరురో, పొటోషి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్సలు అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 800 మీటర్ల లోతుగల లోయలో బస్సు పడిపోవడంతో ఎక్కువ మంది చనిపోయారని అధికారులు తెలిపారు.