Bihar Assembly Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి సంబంధించి ప్రకటనలు, విధాన నిర్ణయాలపై ప్రవర్తనా నియమావళి కేంద్రప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బిహార్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నేతలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పేర్కొంది. ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ వాహనాలను, గృహాలను దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాతోప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ నిషేధించింది.
రాజకీయ పార్టీలు సమావేశాలు, ఊరేగింపుల గురించి ముందుగానే పోలీసు అధికారులకు తెలియజేయాలి, తద్వారా ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను ప్రారంభించడానికి, నిషేధిత ఆదేశాలను పాటించడానికి మరియు లౌడ్ స్పీకర్లకు లేదా ఇతర సౌకర్యాలకు అవసరమైన అనుమతులు పొందాలి.మంత్రులు అధికారిక విధులను ఎన్నికల ప్రచారంతో కలపకూడదు లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రవాణాను లేదా సిబ్బందిని ప్రచార ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అందరు అధికారులు/అధికారుల బదిలీలపై నిషేధం ఉంటుందని కమిషన్ ఆదేశించింది. మైదానాలు, హెలిప్యాడ్లు వంటి బహిరంగ ప్రదేశాలు అన్ని పార్టీలకు ఒకే నిబంధనలపై సమానంగా అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించబడింది.
ఇది కూడా చదవండి: Harish Rao: మహిదీపట్నం నుంచి బస్‌భవన్‌కు బయల్దేరిన హరీష్‌రావు
అటు బిహార్ లో వంద ఏళ్లు పైబడిన ఓటర్లు…. దాదాపు 14 వేల మంది ఉన్నట్లు ఈసీ డేటా వెల్లడించింది. అయితే ఎస్ ఐఆర్ తర్వాత 85 ఏళ్లు పైబడిన వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. ఆ వయోవర్గానికి చెందిన ఓటర్లు..జనవరి 1న 16 లక్షల 7 వేల 527 మంది ఉండగా…. SIR తర్వాత 4 లక్షల 3 వేల 985కు తగ్గినట్లు డేటా స్పష్టం చేసింది. మహిళల ఓటర్ల సంఖ్య 3 కోట్ల 72 లక్షల నుంచి 3 కోట్ల 49 లక్షలకు తగ్గింది. పురుష ఓటర్లు కూడా 3.92 కోట్లకు తగ్గినట్లు ఈసీ వెల్లడించింది. ఇతర ఓటర్ల సంఖ్య 2 వేల 104 నుంచి 17 వందల 25కి తగ్గినట్లు వివరించింది. బీహార్‌లో రెండు దశల ఎన్నికలను సోమవారం ఈసీ ప్రకటించింది, దీనితో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది.