Bigg Boss 9

Bigg Boss 9: అమ్మాయ్య ఓ గొడవ తప్పింది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు మూడో వారం ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టగా, ఇప్పటికే శ్రుష్టి వర్మ, మనీష్ ఎలిమినేట్ అయ్యారు. అయితే మూడో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కామనర్ దివ్య నిఖితను హౌస్‌లోకి పంపించాడు. ఆమె బదులుగా ఎవరిని బయటకు పంపాలో నిర్ణయం తీసే అవకాశం హౌస్ మేట్స్‌కి ఇచ్చారు. అందరూ ఒకే సారి సంజనాకు ఎలిమినేషన్ టికెట్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సంజనాను స్టేజ్‌పైకి రప్పించాడు. కానీ ఆమెను నిజంగానే బయటకు పంపుతారా? లేక సీక్రెట్ రూం డ్రామా కోసం ఉంచుతారా? అన్నది ఆదివారం ఎపిసోడ్‌లో క్లారిటీ రానుంది.

నామినేషన్స్ & ఓటింగ్ ట్రెండ్

ఈ వారం నామినేషన్స్‌లో పవన్ కల్యాణ్, హరీశ్, ప్రియ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్, రీతూ చౌదరి ఉన్నారు. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కాగా, లేటెస్ట్ ఇన్సైడ్ సమాచారం ప్రకారం రాము రాథోడ్ టాప్‌లో కొనసాగుతున్నాడు.

ఇది కూడా చదవండి: Suhas: మరోసారి తండ్రయిన హీరో సుహాస్.. ఫొటో చూశారా?

గత రెండు వారాల్లో త్రుటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న ఫ్లోరా సైనీ ఈసారి ఏకంగా రెండో స్థానంలో ఉండడం హైలైట్‌గా మారింది. కాంట్రవర్సీ క్వీన్ రీతూ చౌదరి మూడో స్థానంలో ఉంటే, మాస్క్ మ్యాన్ హరీశ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక ఐదవ, ఆరవ స్థానాల్లో వరుసగా పవన్ కల్యాణ్ మరియు ప్రియ నిలవడంతో వీరిద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రియ ఎలిమినేట్ అవుతుందా?

ప్రస్తుతం చర్చనీయాంశం ప్రియ భవిష్యత్తే. కామనర్ కోటా నుంచి హౌస్‌లోకి అడుగు పెట్టిన ఆమె మొదట ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కానీ సెలబ్రిటీలతో అనవసరంగా గొడవలకు దిగడం, యాటిట్యూడ్ చూపించడం ఆమెకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా గత వారం సుమన్ శెట్టితో జరిగిన గొడవ ప్రియ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ కారణంగా ఓటింగ్‌లోనూ ఆమెకు నష్టం జరిగిందని టాక్ వినిపిస్తోంది.

అందుకే ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ప్రియ పేరు బలంగా వినిపిస్తోంది. అయినప్పటికీ, బిగ్ బాస్ ఎప్పుడూ ట్విస్టులు చూపిస్తాడు కాబట్టి, ఆదివారం ఎపిసోడ్ వరకూ ఉత్కంఠ కొనసాగనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *