Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్‌9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ కమెడియన్

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ హోరాహోరీగా సాగుతోంది. ఈసారి షోలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, ట్విస్టులు, కంటెస్టెంట్ల గొడవలు, ఊహించని ఎలిమినేషన్లు, మిడ్ వీక్ ఎంట్రీలు అన్నీ కలిపి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టగా, ఇప్పటికే ముగ్గురు బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మరో ఎలిమినేషన్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది.

గత వారం మధ్యలోనే అగ్నిపరీక్ష షోలో సత్తా చాటిన దివ్య నికితా కామనర్స్ కోటా నుంచి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. సామాన్యుల కేటగిరీ నుంచి మరో కంటెస్టెంట్ కూడా హౌస్‌లోకి వచ్చే అవకాశముందని సమాచారం.

ఇక సెలబ్రిటీ కోటా వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయానికి వస్తే.. టెలివిజన్‌ హీరోయిన్ సుహాసిని, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చిట్టి పికిల్స్ రమ్య, సీరియల్ నటీమణి కావ్యశ్రీ, అలాగే అమర్ దీప్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు లేటెస్ట్ టాక్ ఏమిటంటే.. ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను కూడా హౌస్‌లోకి రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: H-1B Visa: H-1B వీసా ఫీజుపై దావా.. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు!

ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో కమెడియన్‌గా అలరించిన ప్రభాస్ శ్రీను విక్రమార్కుడు, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో తన ప్రత్యేక హాస్య టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌కి సన్నిహిత మిత్రుడైన ఆయన, గతంలో ప్రభాస్ డేట్స్‌ని పర్సనల్ అసిస్టెంట్‌గా కూడా మేనేజ్ చేశాడు. తాజాగా సింగిల్ సినిమాలో కూడా తన కామెడీతో ప్రేక్షకులను బాగా నవ్వించాడు.

ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చేతిలో కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ, వాటికి కాస్త విరామం ఇచ్చి బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తాడా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఏదేమైనా, ప్రభాస్ శ్రీను ఎంట్రీ ఇస్తే షోలో ఎంటర్టైన్‌మెంట్ డబుల్ కావడం ఖాయం అంటున్నారు ప్రేక్షకులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *