Bigg Boss 9

Bigg Boss 9: “బయట తోపు అయితే బయట చూసుకో”: మాధురికి నాగార్జున ఫైనల్ వార్నింగ్!

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో వీకెండ్ వచ్చిందంటే చాలు హోస్ట్ కింగ్ నాగార్జున హౌస్‌మేట్స్‌కు తమ పనుల విషయంలో గట్టిగా క్లాస్ తీసుకుంటారు. ఈ వారం కూడా నాగార్జున వచ్చి ఇంటి సభ్యులకు ఒక రేంజ్‌లో ఇచ్చిపడేశారు. ముఖ్యంగా, కెప్టెన్‌గా ఉన్న ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడటంపై నాగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

హౌస్‌మేట్స్ ముందు కొన్ని బోర్డులు ఉంచి, వాటిని ఎవరి మెడలో వేయాలో నిర్ణయించుకోవాలని నాగార్జున ఆదేశించారు. దీని ద్వారా వారి గురించి తమ అభిప్రాయాన్ని చెప్పమన్నారు. కొత్తగా వచ్చిన రమ్య మొదలుపెట్టింది. తాను హౌస్‌లోకి వచ్చినప్పుడు ఎవరితోనూ బాండింగ్ పెట్టుకోనన్న మాధురి ఇప్పుడు ఫేక్ బాండింగ్‌లు పెట్టుకుంటుందని ఆరోపిస్తూ ఆమె మెడలో ‘ఫేక్ బాండింగ్’ బోర్డు వేసింది. దీనికి మాధురి తన అభిప్రాయం మార్చుకున్నానని వివరణ ఇచ్చినా, రమ్య మాత్రం తన అభిప్రాయం అదేనని చెప్పింది.

మాధురిపై నాగార్జున సీరియస్
ఈ ఎపిసోడ్‌లో అత్యంత ముఖ్యమైన విషయం మాధురి ప్రవర్తన. రీతూ వచ్చి, మాధురి “జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా, తాట తీస్తా” అంటూ బెదిరింపు మాటలు వాడిందని నాగార్జునకు తెలిపింది. దీనికి మాధురి “బయట అయితే అలా చేసేదాన్ని” అని వివరణ ఇవ్వబోగా, నాగార్జున తీవ్రంగా మందలించారు. “ఇది బిగ్ బాస్ హౌస్. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి, ఇక్కడ కాదు. ఇలాంటి బెదిరింపు మాటలు వాడొద్దు” అంటూ ఆమెకు చివరి వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Daggubati Rana: దగ్గుబాటి కుటుంబంలో సంబరాలు.. తండ్రి కాబోతున్న రానా ?

ఇమ్మానుయేల్‌ను ఇరికించిన నాగార్జున
ఈ వారం నామినేషన్స్ వ్యవహారంలో కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడటంపై నాగార్జున నిలదీశారు. తనూజను నామినేట్ చేయాలని ఇమ్మూ.. కళ్యాణ్‌కు స్లిప్ ఇచ్చి, తర్వాత మాట మార్చడం పట్ల నాగ్ ఇరికించారు. కళ్యాణ్, ఇమ్మూల మధ్య జరిగిన సంభాషణ వీడియోను ప్లే చేయగా, “నీరు పోసి చచ్చిపోతున్న మొక్కను పెంచినట్లు అయింది” అంటూ ఇమ్మూ చేసిన వ్యాఖ్యలను చూసి తనూజ షాకైంది.

వీడియో చూసిన తర్వాత, “సేఫ్ ఆడొద్దు. నీకు పాయింట్ ఉంటే నువ్వే చెప్పు. వేరే వాళ్లను అస్త్రాలు చేయాల్సిన పనిలేదు” అంటూ నాగార్జున ఇమ్మానుయేల్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇమ్మానుయేల్ టైటిల్ రేసులో ఉన్న తనూజను కార్నర్ చేయాలని చూస్తున్నాడని, అందుకే కళ్యాణ్‌ను వాడుకోవాలని ప్రయత్నించాడని ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమైంది.

కళ్యాణ్ సేవ్, తనూజతో ట్రాక్ ఎలివేషన్
నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఊహించని విధంగా కళ్యాణ్ శనివారం ఎపిసోడ్‌లోనే సేవ్ అయ్యాడు. సేవ్ అయిన వెంటనే, కళ్యాణ్-తనూజ మధ్య నడుస్తున్న ట్రాక్‌కు నాగార్జున వీర లెవల్ ఎలివేషన్ ఇచ్చారు. ఆడియన్స్‌లో నుంచి వచ్చిన పిఠాపురం ఫ్యాన్ ఒకరు కళ్యాణ్, తనూజల గురించి మాట్లాడుతూ, “మీ ఇద్దరిపై మాకు ఫుల్ క్లారిటీ ఉంది. మీరు కామనర్ కాదు, పెద్ద సెలబ్రిటీ” అంటూ తనూజ కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్న విషయాన్ని ఎత్తి చూపాడు. కళ్యాణ్ కూడా తానంటే చాలా ఇష్టమని, తనూజ వల్లే తన గేమ్ బాగుందని చెప్పాడని ఆ ఫ్యాన్ చెప్పడంతో ఇద్దరూ సిగ్గుపడ్డారు.

గోల్డెన్ బజర్ కోసం పోటీ
ఎపిసోడ్ చివర్లో నాగార్జున కొత్త గేమ్ మొదలుపెట్టారు. బోర్డులు వేసే టాస్క్‌లో మాధురికి అత్యధికంగా 4 బోర్డులు వచ్చాయి. ఒక్క బోర్డు కూడా రాని ఏడుగురిని (సుమన్ శెట్టి, రీతూ, ఇమ్మానుయేల్, గౌరవ్, తనూజ, సాయి, డీమాన్) నిలబెట్టి, వారిలో ఒకరికి గోల్డెన్ బజర్ (సేవింగ్ పవర్) గెలుచుకునే అవకాశం కల్పించారు. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌ను పవర్ అస్త్ర ఉన్నందున పక్కన పెట్టి, మిగిలిన ఆరుగురిలో ఐదుగురిని, ఆపై నలుగురిని గోల్డెన్ బజర్ కోసం పోరాడే అర్హత ఉన్నవారిని ఎంపిక చేయమని నాగ్ ఆదేశించారు. ఇమ్మానుయేల్ తన పాయింట్ల ఆధారంగా ఐదుగురిని, ఆ తర్వాత గౌరవ్‌ను తీసేసి నలుగురిని ఫైనల్ చేశాడు. ఈ గోల్డెన్ బజర్ పవర్ ఎవరు గెలుచుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *