Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభమై, రెండో వారానికి చేరింది. మొదటి రెండు వారాల్లో ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు చోటు చేసుకున్నాయి. మొదటి వారంలో శ్రేష్టి వర్మ హౌస్‌ను విడిచిపెట్టగా, రెండో వారంలో కామనర్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యాడు.
సామాన్యుడిగా హౌస్‌లో అడుగుపెట్టిన మనీష్ మొదటి వారంలో బాగానే గేమ్ ఆడాడు. హౌస్‌లో ప్రతీ విషయాన్ని ఓవర్‌గా ఆలోచిస్తూ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడటం. అతడికి నెగెటివ్‌గా మారింది. ముఖ్యంగా ఈ సీసన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణితో గొడవలు అడ్డంగా వ్యవహరించడం, కామనర్లను ను సరిగా చూడకపోవడం ప్రేక్షకులకి నచ్చలేదు.
రెండో వారంలో నామినేషన్స్‌లో మనీష్, సుమన్‌శెట్టి, ప్రియ, డిమోన్ పవన్, హరిత హరీశ్, ఫ్లోరా, భరణిలు ఉన్నారు. చివరికి ఫ్లోరా, మనీష్‌ల ఇద్దరిలో ఎలిమినేట్ కోసం వెయిటింగ్ ఉండగా. అయితే, ప్రేక్షకుల ఓట్లు ఫ్లోరాకు అధికంగా రావడంతో ఆమె సేఫ్ అయ్యారు. చివరికి మనీష్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో హౌస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: విశాఖలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు: సీఎం చంద్రబాబు పాల్గొన్నారు
మనీష్ సొంత తప్పుల వల్లే హౌస్‌లో సమస్యలకు గురయి, ఎలిమినేషన్‌కు కారణమయ్యాడని అనేక రివ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. హౌస్‌లో ఓవర్ థింకింగ్, కామనర్లతో అసహ్య ప్రవర్తన, మరియు నామినేషన్స్‌లో డబుల్ స్టాండర్డ్స్ అతడి నెగెటివిటీని పెంచాయి. కొన్ని సందర్భాల్లో, ప్రియ, శ్రీజ, భరణిలాంటి హౌస్‌మెయిట్స్‌తో సంబంధాల్లో అసౌకర్యాన్ని చూపినప్పటికీ, నిజానికి నామినేట్ చేయకపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు.
రెమ్యూనరేషన్ పరంగా, బిగ్‌బాస్ ద్వారా మనీష్ వారానికి సుమారుగా 60-70 వేల రూపాయల రెమ్యునరేషన్ పొందాడు. రెండు వారాల మొత్తం లెక్కిస్తే, అతడు సుమారుగా 1.4-1.5 లక్షల రూపాయల ఆదాయం సంపాదించాడని సమాచారం. గతంలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో కూడా పాల్గొన్న మనీష్, ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా తన ప్రదర్శనతో హవా రేపి బయటకు వచ్చాడు.
ఇలా, మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయిన మనీష్ మర్యాద హౌస్‌లో తానుకున్న తప్పులు, ప్రేక్షకులకు విరుచుకుపడిన ప్రవర్తనలు అతడి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. ఫ్లోరా మాత్రం సేఫ్‌గా నిలిచడంతో హౌస్‌లో కొనసాగుతున్న పోటీ ఇంకా ఆసక్తికరంగా మారింది.