Bigg Boss 9

Bigg Boss 9: మరోసారి రెచ్చిపోయిన హరీష్.. మీ లాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు..

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో నాలుగో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా, రచ్చ రచ్చగా జరిగాయి. ఈసారి నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్ మధ్య వాగ్వాదాలు, వాదనలతో గది మొత్తం గర్జనలతో మార్మోగిపోయింది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లగా, నాలుగో వారం నామినేషన్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి.

నామినేషన్స్‌లో రాము పేరు వస్తూనే హౌస్‌లో వాతావరణం మరింతగా వేడెక్కింది. హరిత, హరీష్‌ని నామినేట్ చేయడం, ఫ్లోరా అదే లైన్‌లో నిలవడం గొడవలకు కారణమైంది. ముఖ్యంగా సంజన రాము గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు కానీ కాస్త ఓపిక నేర్చుకో” అని సంజన చెప్పడంతో రాము ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై శ్రీజ జోక్యం చేసుకొని, ఆ పదజాలం సరైనది కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే సంజన తన ఉద్దేశాన్ని వివరిస్తూ, “ఓపిక లేని ప్లేస్ నుంచి వచ్చారని మాత్రమే అన్నా” అంటూ సర్దుబాటు చేసుకోవాలనుకుంది.

రాము మాత్రం ఈ వ్యాఖ్యలపై గట్టిగానే స్పందిస్తూ, “నేను మాట్లాడను.. ఆడియన్స్ మాట్లాడతారు” అని చెప్పాడు. దీంతో సుమన్ శెట్టి, హరీష్ కూడా రాముకి మద్దతుగా నిలిచారు. ఇంతలో ఇమ్మానుయేల్ సంజనతో చర్చిస్తూ, “నీకు కోపం వస్తే మాటలు వదిలేస్తావు.. ఇది సరి కాదు” అని గట్టిగా అన్నాడు. దీనికి సంజన “నాకు డబుల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ తెలీదు” అంటూ సమాధానం ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 26 మంది మృతి

మరోవైపు రీతూ చౌదరి, శ్రీజను నామినేట్ చేస్తూ, “ఎవరినైనా గుచ్చి అది ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పడం తప్పు” అని తన కారణం చెప్పింది. దీనికి దివ్య స్పందిస్తూ “శ్రీజ ఇందులో ఇన్వాల్వ్ అయిందని ప్రియ చెప్పింది కానీ నాకు తెలియదు” అని చెప్పడంతో, శ్రీజ ఆగ్రహానికి లోనైంది. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి, “నువ్వు చూడకపోవడం నా తప్పా?” అంటూ దివ్య కూడా రెచ్చిపోయింది.

ఇదిలా ఉంటే, ఫ్లోరా హరీష్‌ని నామినేట్ చేస్తూ “ఎక్కడైతే నమ్మకం ఉండదో అక్కడ స్నేహం ఉండదు.. అది రూల్ నంబర్ 1” అని వ్యాఖ్యానించింది. దీనికి హరీష్ “తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకు ప్రాబ్లమ్ అవుతుంది.. మీ లాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. రాము కూడా హరీష్‌ని నామినేట్ చేయడంతో మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఈ సమయంలో తనూజ జోక్యం చేసుకొని “మీ బట్టే ఉంటుంది నా ఎక్స్‌ప్రెషన్.. మాటలు రాకపోతే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు” అంటూ హరీష్‌పై విరుచుకుపడింది.

మొత్తం మీద నాలుగో వారం నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఘర్షణలు, వాగ్వాదాలతో నిండిపోయి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాయి. ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఎవరు బయటకు వెళ్తారు? అనే సస్పెన్స్‌తో వీక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *