Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: గుండు అంకుల్.. చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. హరీష్, ఇమ్మానుయేల్ మధ్య రచ్చ

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తాజా సీజన్ మొదటి రోజే హౌస్‌లో రచ్చ మొదలైంది. కాంటెస్టెంట్స్ మధ్య చిన్నచిన్న మాటల తగువులు మొదలై, చివరికి హై వోల్టేజ్ డ్రామాగా మారాయి. ప్రత్యేకంగా ఇమ్మానుయేల్–హరీష్ మధ్య జరిగిన మాటల యుద్ధం హౌస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.

గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ అందరికీ సర్‌ప్రైజ్‌గా ఫుడ్ ఏర్పాటు చేశారు. అయితే “ఎవరికి పంపిందో వాళ్లే తినాలి” అనే షరతుతో హౌస్‌మేట్స్ అందరినీ రెండు గ్రూపులుగా విభజించారు బిగ్ బాస్. ఇంతలో గార్డెన్ ఏరియాను శుభ్రం చేయడానికి ఎంత సమయం పడుతుందో బిగ్ బాస్ ఇమ్మానుయేల్‌ను అడిగారు. దీనికి ఇమ్మూ, “ఒక రోజంతా పడుతుంది” అని సమాధానం ఇచ్చాడు. వెంటనే బిగ్ బాస్, “నీ మానిటర్ అయిన హరీష్ సమయాన్ని ఫిక్స్ చేస్తాడు” అన్నారు.

ఇది కూడా చదవండి: Crime News: మంచిర్యాల జిల్లాలో ఘోరం.. లవర్ లేదనే బాధతో ప్రియుడు ఏం చేశాడంటే!

అదే సమయంలో సరదాగా ఇమ్మూ హరీష్‌ను “గుండు అంకుల్” అని పిలవడం మొదలుపెట్టాడు. మొదట్లో నవ్వుతూ దాన్ని ఇగ్నోర్ చేసిన హరీష్, పదే పదే పిలవడంతో కోపం  తెచ్చేసుకున్నారు వెంటనే. “చూసుకుని మాట్లాడాలి బ్రదర్… ఎవరు గుండు? ఎవరు అంకుల్?” అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు. ఇమ్మూ వెంటనే “సారీ అన్నా” అన్నా, హరీష్ మాత్రం “బాడీ షేమింగ్ వరకూ వెళ్లొద్దు” అంటూ కౌంటర్ ఇచ్చాడు.

ఇద్దరి మధ్య మాటల తూటాలు పిడుగుల్లా పడ్డాయి. “మీ మూడ్ బట్టి మనుషులు ఉండరు” అంటూ ఇమ్మూ వ్యాఖ్యానించగా, “చాలా చూశాం, ఇక నా రియాక్షన్ కూడా చూస్తావ్” అంటూ హరీష్ సవాల్ విసిరాడు. “గుండు అంకుల్ అనడం బాగోదు… మీరు ఎక్కడికైనా తీసుకెళ్లండి, నేను రెడీ” అంటూ ఇమ్మూ కూడా మాట పెంచడంతో ఇంట్లో హీట్ పెరిగింది.

కొంతసేపు మాటల యుద్ధం కొనసాగడంతో హౌస్‌లో టెన్షన్ క్రియేట్ అయ్యింది. చివరికి శ్రష్టి, ఇమ్మూ కలిసి హరీష్‌ను పక్కకు తీసుకెళ్లి కూల్ చేశారు. ఆ తర్వాత ఇమ్మూ, “నేను కావాలనే అలా పిలవలేదు, బాడీ షేమ్ చేయాలన్న ఉద్దేశం లేదు” అని క్లారిటీ ఇచ్చాడు. దీనికి హరీష్, “నాకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా… కానీ తల ఎక్కాలని చూస్తే తొక్కేస్తా” అంటూ డైలాగ్ కొట్టాడు.

మొదటి ఎపిసోడ్‌లోనే ఇలాంటి ఫైర్ కంటెంట్ ఇచ్చిన హరీష్, నామినేషన్స్‌లో కూడా ఎక్కువ అటెన్షన్ సంపాదించే అవకాశం కనపడుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *