Bigg Boss 9

Bigg Boss 9: బిగ్ బాస్ 9లో దమ్ము శ్రీజ రీఎంట్రీతో.. నామినేషన్స్‌లో రచ్చ రచ్చ

Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్‌ పూర్తిగా భావోద్వేగాలతో, వాగ్వాదాలతో నిండిపోయింది. రమ్య మోక్ష ఎలిమినేషన్‌తో హౌస్‌లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. నాగార్జున సరికొత్త గేమ్స్‌తో కంటెస్టెంట్స్‌ని ఒక్కొక్కరుగా సేవ్ చేస్తూ వెళ్లగా, చివరికి సంజన, రమ్య మోక్ష మాత్రమే మిగిలారు. చివరికి సంజనను సేవ్ చేస్తూ, రమ్య హౌస్‌ నుండి బయలుదేరింది. కానీ రమ్య వెళ్లిపోయిన షాక్‌ తగ్గక ముందే హౌస్‌లోకి ఎక్స్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చింది. “బిగ్‌బాస్… ఐ యామ్ బ్యాక్! అలా వెళ్తాను అనుకోలేదు, ఇలా వస్తాను అనుకోలేదు!” అంటూ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె స్టైల్‌ ప్రేక్షకుల్లోనూ, హౌస్‌మేట్స్‌లోనూ ఆసక్తి రేపింది.

హౌస్‌లోకి అడుగుపెట్టగానే శ్రీజ, మాధురి వైపు తిరిగి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ పలకరించింది. దాంతో మాధురి “ఐ యామ్ గుడ్ అని చెప్పగానే, శ్రీజ పాత గొడవల్ని గుర్తు చేస్తూ మీ పేరు మాధురి గారా… మాస్ మాధురా గారా? రాజు గారికి తెలీదా? అంటూ సెటైర్ వేసింది. దీంతో మాధురి నీకు నచ్చినట్లు పిలువు అంటూ సమాధానం ఇచ్చింది. కానీ శ్రీజ బయట అడిగితే కూడా ఎవరికీ మాధురి ఎవరో తెలియదు అంటూ మాధురిని మళ్లీ రెచ్చగొట్టింది. అప్పుడు మాధురి నువ్వెవరో నాకు కూడా తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చింది.

Also Read: Mass Jathara: రవితేజ కోసం సూర్య.. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చ రచ్చే..!

ఈ మాటలతో హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కింది. గేమ్ ఆడటానికి వచ్చారా, బాండింగ్స్ పెట్టుకోవటానికా? అని శ్రీజ అడగగా, మాధురి బాండింగ్స్ పెట్టుకోవటానికే వచ్చా అంటూ చెప్పింది. ఈ మాటలతో ఇద్దరి మధ్య చిచ్చు చెలరేగింది. తర్వాత శ్రీజ తనూజ వైపు తిరిగి, గంభీరమైన టోన్‌లో ఒకరు మీ గురించి బయట క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మీరు వారితో బాండ్ పెట్టుకున్నారు. ఆ సపోర్ట్‌తో ఎంతకాలం గేమ్ ఆడతారు? అంటూ ప్రశ్నించింది.

మిమ్మల్ని ‘అక్కా’ అని పిలిచేవాళ్లు ఇప్పుడు అలా పిలవడం మానేశారు. ఎందుకంటే టైటిల్ మీకే ఇచ్చేయమంటారేమో అని అనుకుంటున్నారు అంటూ కౌంటర్లు వేసింది. తనూజ మాత్రం కూల్‌గా స్పందిస్తూ అది మీ అభిప్రాయం శ్రీజ అని చెప్పినా, ఆమె ఆగలేదు. శ్రీజ నామినేషన్ టాస్క్‌లోకి అడుగుపెట్టగానే నేను చాలా డిజప్పాయింట్ అయిన వ్యక్తి ఈ హౌస్‌లో కళ్యాణ్ అంటూ నేరుగా అతడిని టార్గెట్ చేసింది. నువ్వు అమ్మాయిల పిచ్చోడివా? అని నేరుగా అడగడంతో హౌస్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.

కళ్యాణ్ నవ్వుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించగా, శ్రీజ యస్ ఆర్ నో చెప్పు! అంటూ ఒత్తిడి తెచ్చింది. ఆపై కళ్యాణ్ “కాదు” అని సమాధానం ఇచ్చాడు. వెంటనే శ్రీజ అతడిపై విమర్శలు కురిపిస్తూ, నిన్ను బయట అమ్మాయిల పిచ్చోడు అంటున్నారు. నువ్వు ఎందుకు స్పందించలేదు? నీపై క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

కళ్యాణ్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా, శ్రీజ ఒక్కో పాయింట్‌కి మరో పాయింట్‌తో కౌంటర్ వేసింది. నామినేషన్స్‌లో మాధురి గారి మీద నామినేట్ చేయకుండా ఎందుకు రమ్యను, సంజనను టార్గెట్ చేశావు? అంటూ ప్రశ్నించింది. చివరికి కళ్యాణ్ అవును, నా నామినేషన్ వీక్ అని ఒప్పుకుంటాను అని చెప్పక తప్పలేదు. శ్రీజ పంచ్‌లతో హౌస్ మొత్తం కుదిపేస్తుండగా, బిగ్‌బాస్ స్వయంగా జోక్యం చేసుకుని శ్రీజ, మీరు ఇక్కడ నామినేట్ చేయడానికి వచ్చారు. అదే పనిపై ఫోకస్ చేయండి అని హెచ్చరించాడు. దాంతో ఆమె తన నామినేషన్ పూర్తి చేసింది. దమ్ము శ్రీజ రీఎంట్రీతో ఈ వారం నామినేషన్స్‌పై ఆసక్తి రెట్టింపైంది. ఒక్క రోజు హౌస్‌లో ఉన్నా, ఆమె చేసిన వాగ్వాదాలు, కౌంటర్లు, నామినేషన్ పాయింట్లు షోను మరింత హీటప్ చేశాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *