AP Fake Liquor Case

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో.. మరో భారీ మలుపు!

AP Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న కల్తీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జనార్ధన్‌, తాజాగా మరో వీడియోను విడుదల చేసి సంచలన ఆరోపణలు చేశారు.

జోగి రమేష్ ఆదేశాల మేరకే నకిలీ లిక్కర్ తయారీ?
జనార్ధన్‌ తన కొత్త వీడియోలో కీలక విషయాలు వెల్లడించారు. “జోగి రమేష్ చెప్పడం వల్లే తాము నకిలీ మద్యం తయారు చేశామని” ఆయన స్పష్టం చేశారు. ములకలచెరువు అనే ప్రాంతాన్ని సూచించింది కూడా జోగి రమేషే అని జనార్ధన్‌ తెలిపారు.

ప్రభుత్వంపై కుట్రలో భాగమే…
ఈ మొత్తం వ్యవహారం “ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో భాగమే”నని జనార్ధన్‌ ఆరోపించారు. “వాళ్లే (టీడీపీ నేతలు) నకిలీ మద్యం తయారు చేయించి, వాళ్లే రెయిడ్‌ (దాడి) చేయించారని” అన్నారు.

ప్లాన్ మార్చిన జోగి రమేష్?
నకిలీ మద్యం తయారు చేసిన వారిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేయడంతో, జోగి రమేష్ తన ప్లాన్‌ను మార్చారని జనార్ధన్‌ తెలిపారు. అందుకే “ఒక రోజు ముందే ఇబ్రహీంపట్నంకి సరుకు తెప్పించారు” అని వివరించారు.

రూ.3 కోట్ల ఆశతోనే చేశా…
“వాళ్లే రెయిడ్ చేయించి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని” జనార్ధన్‌ పేర్కొన్నారు. అయితే, జోగి రమేష్ తనకు ఆఫర్ చేసిన రూ.3 కోట్లకు ఆశపడి ఇదంతా చేసినట్లు జనార్ధన్‌ వీడియోలో అంగీకరించారు.

జనార్ధన్‌ విడుదల చేసిన ఈ కొత్త వీడియో రాష్ట్ర రాజకీయాల్లో, కల్తీ మద్యం కేసు దర్యాప్తులో ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *