Big Boss 9: బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యుల మధ్య జరిగిన ‘హంగ్రీ హిప్పో’ ఛాలెంజ్ ఉత్కంఠగా సాగింది. ఈ గేమ్‌లో విజయంతో పాటు, కెప్టెన్సీ కంటెండర్షిప్కు అర్హత లభించడంతో హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హంగ్రీ హిప్పో ఛాలెంజ్ హైలైట్స్
బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో పెద్ద హిప్పో బొమ్మను ఏర్పాటు చేసి, అది అరిచినప్పుడల్లా హౌస్‌లో వివిధ చోట్ల ఉన్న బాల్స్‌ను దాని నోటిలో వేయాలని ఆదేశించారు. ఎక్కువ బాల్స్ వేసిన టీమ్ విజేతగా నిలిచి, పవర్ కార్డును గెలుచుకుంటుంది. సంచలక్: భరణి సంచలక్‌గా వ్యవహరించారు.
రెడ్ టీమ్ విజయం: ఇమ్మానుయేల్, కళ్యాణ్, ఫ్లోరా ఉన్న రెడ్ టీమ్ బీభత్సంగా ఆడి గెలుపొందింది. ముఖ్యంగా కళ్యాణ్ చాలా కసిగా ఆడి, తనను తాను నిరూపించుకున్నాడు.
సంజన వింత గేమ్: ఎల్లో టీమ్‌లో ఉన్న సంజన, తమ టీమ్ కోసం ఆడకుండా రెడ్ టీమ్‌కు సహాయం చేయడం చర్చనీయాంశమైంది. “మనం ఎలాగో గెలవం, అందుకే రెడ్ టీమ్‌కు హెల్ప్ చేస్తున్నా” అని సంజన చెప్పడంతో, ఆమె సహచరుడు సుమన్ శెట్టి షాక్ అయ్యారు.
సుమన్ శెట్టి ఆగ్రహం: సంజన తీరుపై సుమన్ శెట్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంజన ‘పెద్దాయన’ అంటూ తనను డామినేట్ చేస్తుందని, ఆమె నోట్లో నోరు పెట్టలేనని రీతూ, డీమాన్‌లతో తన బాధను వెళ్ళగక్కాడు.
Also Read: Baahubali: బాహుబలి: మళ్లీ రాజసం.. ఎపిక్ రీరిలీజ్‌తో అన్నపూర్ణలో హడావిడి!
కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక
రెడ్ టీమ్ గెలుపుతో, టీమ్ సభ్యులైన కళ్యాణ్, ఇమ్మానుయేల్ కెప్టెన్సీ కంటెండర్స్‌గా అర్హత సాధించారు. ఆ తర్వాత, మరో ఆరుగురు సభ్యులను ఎంపిక చేసి, వారిని మూడు జంటలుగా విభజించే బాధ్యతను బిగ్ బాస్ ఈ ఇద్దరికీ అప్పగించారు. డీమాన్‌ను పక్కన పెట్టి, వీరు ఈ జంటలను ఎంపిక చేశారు:
తనూజ – సుమన్
ఫ్లోరా – రీతూ
సంజన – రాము
గార్డెన్ ఏరియాలో జరిగిన తదుపరి ఛాలెంజ్‌లో రీతూ, రాము గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్‌గా మారారు. లీకుల ప్రకారం, వీరిలో రాము హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా అయ్యే అవకాశం ఉంది.
తనూజ కన్నీరు, హరీష్ బాధ
మరోవైపు, కొత్త గేమ్‌లో ఫౌల్ చేసినందుకు తనూజను గేమ్ నుంచి తప్పించారు. దీంతో తను బాత్రూమ్లోకి వెళ్లి బోరున ఏడ్చేసింది. రీతూ వెళ్లి ఆమెను ఓదార్చింది.
ఇక, ఇప్పటికే ‘ఆడవాళ్లను చిన్నచూపు చూస్తాడు’ అనే నిందను ఎదుర్కొంటున్న హరీష్, మరో గేమ్‌లో దివ్యను జాగ్రత్తగా పట్టుకున్నప్పటికీ, ఆమె కావాలనే “చేయి ఎక్కడ పెడుతున్నారు? చూసుకుని పెట్టండి” అని చీదరించుకుంది. దీంతో బాధపడిన హరీష్ వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించి, చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం ఎపిసోడ్లో విషాదకర దృశ్యాలు.