Bhu Bharati Act: రాష్ట్రంలో ధరణి పథకానికి బదులు భూభారతి చట్టం అమలు చేయడానికి అంతా సిద్ధమైంది. ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలుత మూడు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయా మండలాల్లో సదస్సుల ద్వారా రైతుల నుంచి సమాచారం సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అక్కడి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం.. మార్పులు చేర్పులు ఉంటే చేసి ఆ చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈపథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
Bhu Bharati Act: రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూభారతి చట్టం గురించి క్షేత్రస్తాయిలో అవగాహన కల్పించాలని, అక్కడి నుంచి వచ్చే సలహాలు, సూచనలను కూడా స్వీకరించాలని సూచించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
Bhu Bharati Act: భూభారతి పోర్టల్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాప్‌ను అభివృద్ధి చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగా సమస్యల పరిష్కారానికి నెలల కొద్దీ ఆలస్యం జరగకుండా, త్వరితగతిన పరిష్కారం అయ్యేలా యాప్‌లో రూపొందించినట్టు తెలిపారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే గ్రామ పాలనాధికారుల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Bhu Bharati Act: హైదరాబాద్ శిల్పకళావేదికలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా 14న ఈ భూభారతి చట్టం పోర్టల్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఇక నుంచి ధరణి స్థానంలో భూభారతి చట్టం అమలులోకి రానున్నది. ఈ పోర్టల్ ద్వారానే భూముల క్రయ విక్రయాలు జరగనున్నాయి. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఇంతకు ముందు 33 మ్యాడ్యుళ్లు ఉండేవి. వాటిని ఇప్పడు ఆరుకు కుదించారు. క్షేత్రస్థాయిలో నిర్ణీత విచారణ పూర్తయ్యాకే పాస్ పుస్తకాలను మంజూరు చేస్తారు.