పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి చెబుతూ అన్ని వర్గాల విద్యార్థులందరినీ కులీలకతీతంగా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వారి మధ్య విబేధాలు లేకుండా చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు.
కామన్ క్రీడా ప్రాంగణం, కామన్ డైనింగ్ హాల్, కామన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో అన్ని వర్గాల విద్యార్థులకూ అడ్మిషన్లు అందిచడం జరుగుతుందన్నారు.