Bhatti vikramarka: తెలంగాణను పర్యావరణహిత అభివృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మారుస్తామని, దీని కోసం వివిధ చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు.
హైదరాబాద్‌ను బిల్డింగ్ రంగానికి స్వర్గధామంగా మార్చే ప్రణాళిక పర్యావరణహిత నగరంగా మారేందుకు డీజిల్ వాహనాలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అనువైన విధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం తెలంగాణను ఆధునిక దేశాల సరసన నిలిపేలా అభివృద్ధి చేయడం ఈ చర్యలు హైదరాబాద్ నగరాన్ని మరింత పచ్చదనంతో, సుస్థిర అభివృద్ధితో, అధునాతన మౌలిక సదుపాయాలతో ముందుకు తీసుకెళ్లే అవకాశం కల్పిస్తాయని భట్టి విక్రమార్క అన్నారు.