Bhatti vikramarka: క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్‌కి మంత్రివర్గంలో చోటు కల్పించకూడదని లేఖలు రాయడం దారుణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తీవ్రంగా స్పందించారు. దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిన అజారుద్దీన్ వంటి వ్యక్తిని కేబినెట్లోకి రానివ్వకుండా కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
బీజేపీ ఈ లేఖలు రాస్తూ, ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చాలని చూస్తోందని భట్టివిక్రమార్క విమర్శించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశారని కూడా ఆయన పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా బీజేపీపై విమర్శలు చేస్తూ, మైనారిటీ నేతను మంత్రివర్గంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. ఉపఎన్నికల సమయంలో మంత్రిపదవిపై బీజేపీ ప్రశ్నించడం విచిత్రమని పేర్కొన్నారు.

