Betting Apps Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసుల విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. బెట్టింగ్ యాప్స్ కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన కేసులన్నింటినీ సీఐడీ విచారించనున్నది. దీంతో ఇప్పటి వరకూ బెట్టింగ్ యాప్స్ విషయంలో నమోదైన కేసులన్నింటినీ ఒకే గొడుగు కింద విచారణ జరపనున్నారన్నమాట.
Betting Apps Case: ఇప్పటికే హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసులు నమోదయ్యాయి. అదే విధంగా సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ విషయంలో అందిన ఫిర్యాదుల మేరకు అగ్రహీరోల నుంచి యూట్యూబర్స్ వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
Betting Apps Case: హైదరాబాద్, సైబరాబాద్‌ల పరిధిలో కొంత మంది ప్రమోటర్లపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులను పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కేసులు కూడా నమోదయ్యాయి. లోతైన విచారణ ప్రారంభించిన పోలీసులు నగదు లావాదేవీలపై నజర్ పెట్టారు. ఈ దశలో బయ్య సన్నీయాదవ్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌పై లుకౌట్ నోటీసులు సైతం జారీ అయ్యాయి.